తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)లో కార్మికులు (RTC employee) మళ్లీ సమ్మె (Strike) బాట పట్టబోతున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఉద్యోగుల సమస్యలపై సాధికారత కోసం ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, ఉద్యోగుల విలీనం వంటి ప్రధాన సమస్యలు ఈ సమ్మెకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. బస్ భవన్ వద్ద ఈ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వేతన సవరణ విషయంలో సంస్థ లేవనెత్తిన సమస్యలు, ట్రేడ్ యూనియన్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడం వంటి డిమాండ్లను కార్మిక సంఘాలు ముందుకు తెచ్చాయి.
Railway Jobs 2025 : రైల్వేలో 32438 జాబ్స్.. టెన్త్‌తోనూ ఛాన్స్.. తెలుగులోనూ పరీక్ష
కార్మికుల అనుభవాలను గౌరవించి, వారి ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. గతంలో తాము చేసిన డిమాండ్లకు సరైన సమాధానం రాకపోవడంతోనే ఈసారి సమ్మె చేపట్టాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. ఒకవేళ వీటి గురించి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ప్రయాణికులకు అసౌకర్యం తప్పదని వారు హెచ్చరించారు.ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, తగిన చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన సమ్మెల కారణంగా ఆర్టీసీ భారీగా నష్టపోయింది. కాబట్టి ఈసారి ముందుగానే సజావుగా పరిష్కారం పొందడం అనివార్యమని వారు సూచిస్తున్నారు.