Site icon HashtagU Telugu

TG TET : టెట్ ఫలితాలు విడుదల

Tg Tet Results

Tg Tet Results

TG TET : తెలంగాణ టెట్‌ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2న ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు జనవరి 20న ముగిశాయి. మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్‌-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

TG TET 2025 రిజల్ట్ చెక్ చేసుకునే విధానం
1. మొదట అధికారిక వెబ్‌సైట్ [tgtet2024.aptonline.in/tgtet/](https://tgtet2024.aptonline.in/tgtet/) ను ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో TG TET 2025 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా ఇతర లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
4. పేపర్ 1 లేదా పేపర్ 2 ఎంపిక చేసుకోవాలి.
5. స్క్రీన్‌పై ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
6. రిజల్ట్‌ను చెక్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌ తీసుకోవచ్చు.

Teenmaar Mallanna : కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా ..? – తీన్మార్ మల్లన్న

TG TET 2025 పరీక్ష విధానం
TG TET‌లో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1: 1 నుండి 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన పరీక్ష.
పేపర్ 2: 6 నుండి 8వ తరగతులకు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన పరీక్ష.

ఉత్తీర్ణత మార్కులు ఇలా ఉంటాయి:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు – కనీసం 60% మార్కులు (లేదా అంతకంటే ఎక్కువ) సాధించాలి.
బీసీ అభ్యర్థులు – కనీసం 50% మార్కులు తప్పనిసరిగా పొందాలి.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు – కనీసం 40% మార్కులు సాధించాలి.

టీచర్ ఉద్యోగాల భర్తీ సమయంలో టెట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏడాది టెట్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో TG TET సర్టిఫికెట్ 7 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేది. అయితే, ఇప్పుడు టెట్ స్కోర్ జీవితకాలం చెల్లుబాటులో ఉండనుంది.

TGPSC గ్రూప్-1 ఫలితాలపై సుప్రీంకోర్టు తీర్పు
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాల విడుదలకు ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3న కీలక తీర్పునిచ్చింది. జీవో నం.29 ను వ్యతిరేకిస్తూ దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.

గ్రూప్-1 అభ్యర్థులు ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుందని హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టులో పిటిషన్‌ను కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి, సుప్రీంకోర్టు ఫలితాల విడుదలకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో TGPSC త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 11 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత తొలిసారి గ్రూప్-1 నియామకాలు జరగబోతున్నాయి. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే TGPSC అధికారికంగా ఫలితాలు ప్రకటించి, తదుపరి నియామక ప్రక్రియను ప్రారంభించనుంది.

BCCI Drops ‘Ro-Ko’: నెట్స్‌లో చెమ‌టోడుస్తున్న స్టార్ ప్లేయ‌ర్స్‌.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!