Site icon HashtagU Telugu

Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్

Template 2021 12 30t164111

Template 2021 12 30t164111

పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది.

కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ అనే ఈ ఉగ్రవాదిని హతమార్చినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. సమీర్ దార్ జైషే ఉగ్రవాద సంస్థలో అగ్రశ్రేణి కమాండర్. డిసెంబరు 30న జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ తో పాటు మరో ఇద్దరిని కూడా మట్టుబెట్టినట్టు విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన మొన్ననే జరిగినప్పటికీ, డీఎన్ఏ టెస్టులు జరిపిన అనంతరం సమీర్ దార్ గుర్తింపును నిర్ధారించారు.