Site icon HashtagU Telugu

Terrorist Killed: ఎన్‌కౌంట‌ర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం

Terrorist Killed In Bandipo

Terrorist Killed In Bandipo

Terrorist Killed: అనంతనాగ్‌లోని బందిపోరాలో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్ర‌వారం ఉద‌యం జవాన్లు ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు. అయితే ఉగ్రవాదులతో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో (Terrorist Killed) ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. బందిపోరా జిల్లాలోని కుల్నార్ బాజీపోరాలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు, శోధన కార్యకలాపాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ సెర్చ్ ఆప‌రేష‌న్‌ ఎదురుకాల్పులుగా మారిందని వారు వివరించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.