American Airlines: ప్రయాణికులకు భయంకర అనుభవం.. 3 నిమిషాల్లో 15 వేల అడుగుల కిందకు దిగిన విమానం?

ఇటీవల కాలంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏదో ఒక రకమైన చేదు అనుభవాలు భయంకరమైన అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫ్లైట్ లు

Published By: HashtagU Telugu Desk
American Airlines

American Airlines

ఇటీవల కాలంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏదో ఒక రకమైన చేదు అనుభవాలు భయంకరమైన అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫ్లైట్ లు ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వడం, టెక్నికల్ లోపం రావడం లాంటి వింత సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా అమెరికాలో ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది. అమెరికాలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందకు దిగడంతో ప్రయాణికులందరు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానం 5916 ఇటీవల ఉత్తర కరోలినాలోని షార్లెట్‌ నుంచి ఫ్లోరిడా లోని గెయిన్జ్‌విల్‌కు బయల్దేరింది. అయితే, మార్గమధ్యలో 29వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో పీడనం సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్‌ అందజేశారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందకు దించి, తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించిన పైలట్లు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

దీంతో ఆ విమానం కేవలం ఆరు నిమిషాల్లో 18,600 అడుగుల కిందకు దిగినట్లు ఫ్లైట్‌అవేర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫ్లోరిడా యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్‌ హారిసన్‌ హోవ్‌ తన అనుభవాన్ని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. నేను చాలాసార్లు విమానంలో ప్రయాణించాను. కానీ, ఇది భయానక అనుభవం రాసుకొచ్చారు. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తినందునే కిందకు దించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.

  Last Updated: 14 Aug 2023, 03:50 PM IST