Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్తాన్‌లో ఘోరం.. కాల్పుల్లో 8 మంది టీచర్లు హతం

Pakis

Pakis

Pakistan: పాకిస్తాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రభుత్వం ఉపాధ్యాయులు కాల్చివేతకు గురయ్యారు. కొంతమంది దుండగులు ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చూస్తుండగా ఉపాధ్యాయులను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తుంబ్వా కుర్రమ్ తహసిల్‌లోని తరి మంగళ్ గవర్నమెంట్ స్కూల్‌లో జరిగింది. గన్‌లు పట్టుకుని పాఠశాలలోని స్టాఫ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఏడుగురు ఉపాధ్యాయులు ఒక్కసారిగా దుండగులు అందరూ కలిసి కాల్పులు జరిపారు.

ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉపాధ్యాయులు అక్కడిక్కడే మరణించారు. ఇక ఇలాంటి ఘటన మరో ప్రాంతంలో కూడా చోటుచేసుకుంది. పరాచినార్ ప్రాంతంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని స్కూల్‌లోని అందరి ముందే కాల్చివేశారు. దీంతో కాల్పుల్లో ఒక్కరోజులోనే మరణించిన ప్రభుత్వ టీచర్ల సంఖ్య 8కు చేరుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా ప్రభుత్వ పాఠశాలలోనే ఉపాధ్యాయులను కాల్చి చంపేయడం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది.

అయితే ఇది ఉగ్రవాదుల పని అంటూ కొంతమంది చెబుతున్నారు. కానీ దీనికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన జారీ చేయలేదు. పాకిస్తాన్ లో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఇక సంక్షోభం క్రమంలో శాంతి భద్రతలు కూడా అదుపు తప్పాయి. ఒకవైపు ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో ఇప్పుడు శాంతి భద్రతలు కూడా అదుపు తప్పడం అక్కడి ప్రజలను కలవరపరుస్తుంది.

అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులను చంపడానికి కారణం ఏంటనే దానిపై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అక్కడి పోలీస్ అధికారులు దీనిపై విచారణ చేపడుతున్నారు. ఈ కాల్పుల ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version