Site icon HashtagU Telugu

‘SVP’ In OTT: ఓటీటీలోకి ‘సర్కారు వారి పాట’.. ఎప్పుడంటే?

Sarkari

Sarkari

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్లలో విడుదలై రెండు వారాలైనా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో OTTలో రానుంది. ఈ చిత్రం జూన్ 10 లేదా జూన్ 24 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ప్రస్తుతానికి ప్రైమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, నదియా, సుబ్బరాజు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ స్వరాలు సమకుర్చారు.