కృష్ణా జిల్లా యనమలకుదురులో, “ఇదేం కర్మరా” అంటూ TDP నిరసన కార్యక్రమం చేప్టటింది. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. TDP నిరసన ర్యాలీని YSRCP నేతలు అడ్డుకోవడంతో YSRCP నేతలు, TDP నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన ర్యాలీ చేపడతామని TDP శ్రేణులు చెబుతుండగా.. అడ్డుకుంటామని YSRCP నేతలు చెబుతున్నారు.
యనమలకుదురులో వాగుపై ఉన్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని TDP నేతలు డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణంపై నిరసనల పేరుతో TDP నీచ రాజకీయాలు చేస్తోందని TSRCP ఆరోపించింది. కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయని YSRCP నేతలు తెలిపారు.