Site icon HashtagU Telugu

Bandi sanjay : అబ్దుల్లాపూర్‌మెట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు

bandi sanjay

bandi sanjay

అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బీజేపీ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. మలక్ పేట్ వద్ద బండి సంజయ్ ను పోలీసులు చుట్టుముట్ట‌గా.. పోలీసు వలయాని తప్పించుకొని మునుగోడు బయలుదేరారు. అయితే రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిలిం సిటీ వద్ద బండి సంజ‌య్ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. జాతీయ ర‌హ‌దారికావ‌డంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల జులుం నశించాలంటూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.