కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ లోని రెండు వర్గాల సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువూరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఈ రోజు కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్దకు కానీ, జూపల్లి ఇంటికి కానీ చర్చకు వెళ్లేందుకు ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. ఇరువర్గాల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు, హర్షవర్థన్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇరువురి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్యల కారణంగా ఎలాంటి చర్చలకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రం ఖచ్చితంగా జూపల్లి ఇంటికి వెళ్లి తీరుతామని చెప్తున్నారు.
Kollapur : కొల్లాపూర్ లో టెన్షన్.టెన్షన్… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు

Mla Beeram Harshavardhan Reddy Vs Jupally Krishna Rao