Site icon HashtagU Telugu

AP Assembly : ఏపీ అంసెంబ్లీలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..?

Ap Assembly Tdp Mlas

Ap Assembly Tdp Mlas

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జీవో నెం1 పై టీడీపీ వాయిదా తీర్మాణం ఇచ్చింది. దీంతో టీడీపీ సభ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. స్పీక‌ర్ త‌మ సీట్ల‌లో కూర్చోవాల‌ని ఎంత చెప్పిన విన‌క‌పోవ‌డంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ స‌భ్యుల‌పై మాట‌ల దాడి చేశారు. దీంతో ఇరువురి మ‌ధ్య మాట‌ల యుద్ధం పెర‌గ‌డంతో వైసీపీ ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరంజ‌నేయ‌స్వామిపై దాడికి య‌త్నించిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ స‌భ‌ను వాయిదా వేశారు. వీరాంజ‌నేయ‌స్వామిపై దాడిని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నించారు. ఈ ఘటనను పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కు అచ్చెన్నాయుడు ఫోన్లో తెలిపారు. ఎమ్మెల్యే స్వామి పై అసెంబ్లీ లో దాడిని చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు.

Exit mobile version