Site icon HashtagU Telugu

Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయం క్యూలైన్లో కొట్లాట‌… మంత్రి స‌మ‌క్షంలోనే..!

Srikalahasti Temple

Srikalahasti Temple

శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు క్యూలైన్‌లో కొట్టుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. దీంతో క్యూలైన్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది. దీంతో ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై ఇంకా ఆల‌య అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.