Site icon HashtagU Telugu

Adilabad: ఉగ్రకుట్ర.. ఆదిలాబాద్ హై అలర్ట్‌!

Terrarists

Terrarists

నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి ఆదిలాబాద్‌కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారనే వార్తలతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వాంటెడ్ ఖలిస్తాన్ ఉగ్రవాది ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు సమాచారం. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో వారిని అరెస్టు చేయగా, ఈ వార్త స్థానికుల వెన్నులో వణుకు పుట్టించింది. హైదరాబాద్‌లో కూడా హై అలర్ట్‌ ప్రకటించారు. కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు గతంలో పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఇది రెండో ఆపరేషన్ అని చెప్పారు. ఉగ్రవాదులకు స్థానికుల నుంచి మద్దతు లభిస్తుందని, బంగ్లాదేశ్ వలసదారులు పెద్ద సంఖ్యలో ఈ జిల్లాలో స్థిరపడినందున, తమకు సురక్షితమైన ప్రదేశం అని స్థానికులు నమ్ముతారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నిరాకరించారు.

ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అరెస్టయిన ఉగ్రవాదులను గురుప్రీత్, అమన్ దీప్, భూపేంద్ర, పర్మిందర్ గా గుర్తించారు. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వారు ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్ర తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు దేశ సరిహద్దులకు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా తీసుకువచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్ ఈ ఆయుధాలు పంపినట్టు తెలిసింది.