Site icon HashtagU Telugu

TS : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత. వైఎస్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు..!!

Ys Sharmila

Ys Sharmila

హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రగతిభవన్ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమాజిగూడ నుంచి ప్రగతిభవన్ కు బయలుదేరిని వైఎస్ షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న నర్సంపేటలో తన వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో ఇవాళ షర్మిలా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. నిన్న రాళ్ల దాడిలో ధ్వంసమైన కారులోనే వైఎస్ షర్మిల ప్రగతిభవన్ కు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో కారును రోడ్డుపైన్నే వదిలేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. తనపై జరిగిన దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పోలీసుల అనుమతితోనే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షర్మిల కారులో ఉండగానే కారును క్రేన్ ద్వారా అక్కడి నుంచి తరలించారు పోలీసులు. తనపై జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.