Collector: వివాదంలో నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌ ముషార‌ఫ్ అలీ!

క‌లెక్ట‌ర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆ జిల్లాలో ఉత్త‌ర్వులు జారీ అయిపోయాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 11:48 AM IST

క‌లెక్ట‌ర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆ జిల్లాలో ఉత్త‌ర్వులు జారీ అయిపోయాయి. ఈ మేర‌కు నిర్మ‌ల్ త‌హ‌సీల్దార్ శివ‌ప్ర‌సాద్‌.. క‌లెక్ట‌ర్ టెన్నిస్ హెల్ప‌ర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ జాబితాను విడుద‌ల చేశారు. ఈ జాబితాలోని 21 మంది వీఆర్ఏల‌లో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళ‌ల్లో క‌లెక్ట‌ర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వ‌ద్ద బంతులు అందించే విధుల‌కు హాజ‌రు కావాల‌ట‌. ఈ జాబితా మీడియాకు చిక్క‌డంతో ఒక్క‌సారిగా క‌లెక్ట‌ర్‌పై వివాదం రేగింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కలెక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు మండిపడుతున్నాయి.