BRS Minister: కుమ్ములాట కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు నమ్మరని, కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పదిమంది పోటీపడి కుమ్ములాడుకుంటున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కోస్గి కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి వారు సీఎం లుగా చెప్పుకుంటున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ పార్టీ నీ నమ్మరని మహేందర్ రెడ్డి అన్నారు. గత 50 ఏళ్లుగా లేని అభివృద్ధిని కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలు ఐదేళ్లలో చూశారని మహేందర్ రెడ్డి చెప్పారు.
అనునిత్యం ప్రజల్లో తిరిగి పట్నం నరేందర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కావాలా ఎప్పుడు ఎన్నికల అప్పుడు వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులు కావాలా అని ప్రజలు ఆలోచించాలని మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజలను నమ్మించేందుకు మరో మారు కుట్రలు పన్నుతూ ఆరు గ్యారెంటీలు అని హామీలు ఇస్తున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఆ ఆరు గ్యారెంటీలను మొదట పురుగుని ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎందుకు అమలు చేయలేకపోతున్నారని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని మహేందర్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం పార్టీ గెలుపుకు శ్రీరామరక్షగా నిలుస్తుందని
సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారని, కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తారని మహేందర్ రెడ్డి తెలిపారు. వందల కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మహేందర్ రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, దళిత బంధు, బీసీ బందు, పథకాలను అమలు పరచామని అన్నారు. కొత్తగా మహిళలకు నెలకు 3000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి బీమా పథకం లాంటి ఎన్నికల హామీలు అమలుపరిచి తీరుతామని మహేందర్రెడ్డి చెప్పారు.