Hyderabad 40 Deg: తెలంగాణలో మంగళవారం దంచికొట్టిన ఎండ…రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!

తెలంగాణలో మంగళవారం ఎండ దంచికొట్టింది. కొన్నిరోజులుగా చల్లబడిన వాతావరణం..భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది.

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 11:52 PM IST

తెలంగాణలో మంగళవారం ఎండ దంచికొట్టింది. కొన్నిరోజులుగా చల్లబడిన వాతావరణం..భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వడగాల్పులు కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోత తాళలేక అల్లాడుతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా గార్లలో 43. 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లా ధర్మసాగ్, బూర్గంపహాడ్, ఖమ్మం జిల్లా చింతకానీ, జనగామ జిల్లా చిల్పూరు, హన్మకొండ జిల్లా ఖాజీపేట, ములుగు జిల్లా తాడ్వాయి, ఖమ్మం అర్బన్, సూర్యపేట పెన్ పహాడ్, కరీంనగర్ జిల్లా వీణవంక, నల్లగొండ జిల్లా కనగాల, ఖమ్మం జిల్లా ముదిగొండలో 43 డిగ్రీల సెల్సియస్ పైన్నే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.