Site icon HashtagU Telugu

CBN & Revanth : విదేశీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ బిజీ ..

Telugu Cms Foreign Tour

Telugu Cms Foreign Tour

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu CMS) విదేశీ పర్యటన(Foreign Tour)లో బిజీగా కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈరోజు సాయంత్రం యూరప్ పర్యటన (Europe Tour)కు వెళ్లనున్నారు. ఈ పర్యటన వ్యక్తిగతంగా ఉంటూ, కుటుంబంతో కలిసి జరగనుంది. ఈ నెల 20వ తేదీ ఆయన పుట్టినరోజు (CBN Birthday ) సందర్భంగా కుటుంబ సభ్యులతో అక్కడే జరుపుకోనున్నారు. ఈ నెల 22వ తేదీన ఆయన యూరప్ నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. హస్తినలో 23న కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.. చంద్రబాబు వ్యక్తిగత పర్యటనపై యూరప్‌ వెళుతున్నారు. ఇవాళ చంద్రబాబు ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి వెళ్లారు.. అక్కడ 16వ ఆర్థికసంఘం సభ్యులతో భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నివాసానికి వెళతారు.. ఆ తర్వాత రాత్రికి కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విదేశీ పర్యటనకు వెళుతున్నారు.

Gold Rate: మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఎంత పెరిగిందో తెలుసా?

ఇక మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా జపాన్ పర్యటన(Japan Trip)కు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆయన, అక్కడి నుంచి జపాన్ వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా 18వ తేదీన జపాన్ చేరుకోనున్నారు. టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి ఇప్పటికే జపాన్‌లో ఉన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పారిశ్రామిక, సాంకేతిక సహకారాలపై చర్చలు జరపనుంది. ఈ నెల 23న జపాన్ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.