Site icon HashtagU Telugu

Swa: ఫిబ్రవరి 4 న థియేటర్లలోనికి రానున్న ‘స్వ’

Swa

Swa

జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థ లో జీ.ఎం సురేష్ నిర్మాత గా మను పి వి దర్శకత్వం లో మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణం గా నటించిన స్వ చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియాటర్ల లోనికి రానుంది.ఈ చిత్రానికి సంగీతాన్ని కరణం శ్రీ రాఘవేంద్ర సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రయిలర్ అందర్నీ ఆకట్టుకుంటుండగా కన్నుల్లోన అంటూ సాగే పాటను నిన్న విడుదల చేసారు, ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ పాటను వినోద్ శర్మ మరియు నాదప్రియ పాడగా కరణం శ్రీ రాఘవేంద్ర రచించి స్వరపరిచారు. ఈ చిత్ర నిర్మాత సురేష్ మాట్లాడుతూ ఇటీవలే మా ఈ స్వ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ వారి నుండి మంచి అభినందనలు పొందుకుంది. సినిమా పై పూర్తీ నమ్మకం ఉన్నట్టు ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

Exit mobile version