Site icon HashtagU Telugu

Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్..  అదే కేసులో..!

ganta srinivasa rao fire on cm jagan

ganta srinivasa rao fire on cm jagan

Ganta Srinivas Arrest :  ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ లో ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన పోలీసులు.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు‌ను కూడా అరెస్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావుతో పాటు  ఆయన  కొడుకును అదుపులోకి తీసుకున్నట్టు  తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన  కొడుకును  కూడా పోలీసులు అరెస్ట్  చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ లో అభియోగాలు ఉన్నాయనే ఆరోపణలతోనే వారిని  అరెస్టు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న టైంలో  .. గంటా శ్రీనివాసరావు  సంబంధిత శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారని, అందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఏపీ సీఐడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Also read : Chandrababu Hashtags: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌.. బాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్..!