Site icon HashtagU Telugu

Bigg Boss: బిగ్ బాస్ కు హైకోర్టు షాక్, రియాల్టీ షో ఆపేయాలంటూ నోటీస్

Bigg Boss Season 6

Bigg Boss Season 6

రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కు ఆదిలోనే గట్టి షాక్ తగిలేలా ఉంది. మరోసారి చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. రియాలిటీ షో రాబోయే సీజన్‌ను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. షోను ప్రసారం చేస్తున్న ఛానెల్‌తో పాటు దాని హోస్ట్ నాగార్జున అక్కినేనికి నోటీసు పంపినట్టు తెలుస్తోంది. వర్గాల సమాచారం ప్రకారం.. నోటీసుకు ప్రతిస్పందనగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఈ కేసుపై తుది విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

బిగ్ బాస్ తెలుగు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ షోపై గతంలోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటివరకు ఆరు సీజన్‌లను పూర్తి చేసుకుని తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. దీంతో సీజన్7 కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫస్ట్ ప్రోమో ఆకట్టుకుంది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున కొత్త లుక్‌లో కనిపించారు.

Also Read: Bhola Shankar Trailer: భోళా శంకర్ ట్రైలర్ ఆగయా.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!