Monkeypox : తెలంగాణ‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు.. ప‌రీక్ష‌ల్లో నెగెటివ్‌

మంకీపాక్స్‌ అనుమానాస్పద లక్షణాలతో ఉన్న వ్యక్తికి ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 07:00 AM IST

మంకీపాక్స్‌ అనుమానాస్పద లక్షణాలతో ఉన్న వ్యక్తికి ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. మంకీపాక్స్ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపిన శాంపిల్స్ నెగెటివ్‌గా ఉన్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు ప్రకటించారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. 40 ఏళ్ల వ్యక్తి నుంచి ఐదు రకాల నమూనాలను పంపారు. జులై 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి జూలై 20న జ్వరం రావడంతో శరీరంపై దద్దుర్లు రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాడు.

వ్యాధిగా భావించిన వైద్యులు అతడిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసి అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించి ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఆదివారం చేర్పించారు. మంకీపాక్స్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస‌రావు గతంలో తెలిపారు. తెలంగాణలో మంకీపాక్స్‌కు సంబంధించిన మొదటి అనుమానిత కేసు ఇదే. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జూలై 17న మొదటి అనుమానిత కేసు నమోదైంది. కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లిన రెండేళ్ల చిన్నారి తిరిగి వచ్చేసరికి చర్మంపై దద్దుర్లు కనిపించాయి. అయితే పూణేలోని ఎన్‌ఐవీకి పంపిన శాంపిల్స్ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది.