Site icon HashtagU Telugu

Telangana Cases @ 1,000: తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా కేసులు

Covid Fourth Wave Imresizer

Covid Fourth Wave Imresizer

కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో తెలంగాణలో గురువారం 1,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య అధికారుల సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,061 కొత్త కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో రాష్ట్రం వెయ్యి దాటడం ఇది రెండోసారి. మూడో  వేవ్ తర్వాత మొదటిసారిగా  రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య  1,000 మార్కును దాటింది. మూడో వేవ్ నవంబర్ 2021, జనవరి 2022 మధ్య కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 43,318 నమూనాలను పరీక్షించారు. అదే సమయంలో మొత్తం 836 మంది కోలుకున్నారు. రికవరీ రేటు ఇప్పుడు 98.75 శాతంగా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,357కి పెరిగింది. వీరిలో 236 మంది ఆసుపత్రుల్లో చేరారు.  40 మంది ఐసీయూలో, 92 మంది ఆక్సిజన్ బెడ్‌లలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వరుసగా 63, 56 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో 16 మంది విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలింది. నేరేడుగొమ్ములోని పాఠశాల ఉపాధ్యాయుడికి కూడా కరోనా సోకింది. కొంతమంది విద్యార్థులకు జ్వరం, జలుబు మరియు దగ్గు వంటి అనుమానిత లక్షణాలు కనిపించడంతో, పరీక్షలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. వ్యాధి సోకిన పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల అధికారులు సమాచారం అందించారు. ముందస్తు జాగ్రత్తగా వారందరినీ ఇంటికి పంపించారు.

Exit mobile version