Site icon HashtagU Telugu

KTR: ఎన్నో త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడింది: మంత్రి కేటీఆర్

KT Rama Rao

Telangana Minister KTR America Tour

తెలంగాణ ఏర్పాటుపై మోడీతో సహా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ యువత త్యాగాల ఫలితమే తెలంగాణ అని కేటీఆర్ ఓపెన్ నోట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సందర్భం కాదు, చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది అని ఆయన అన్నారు.

‘‘తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు. జూన్ 2, 2014 న సాకారం చేసుకున్నారు. రాష్ట్రావతరణ దిశగా సాగిన ప్రయాణం లెక్కలేనన్ని త్యాగాలతో, ప్రత్యేకించి తెలంగాణ యువకుల పాత్ర మరువలేనిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని సూచించడం వాస్తవంగా సరికాదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నంలో ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.

Also Read: ANR Idol: రేపు అక్కినేని జయంతి, పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రంగం సిద్ధం!