Site icon HashtagU Telugu

Telangana TDP : ఆ బీఆర్ఎస్ అభ్యర్థికి తెలంగాణ టీడీపీ మద్దతు

Tdp Political Action Committee Announced by Atchennaidu

Tdp Political Action Committee Announced by Atchennaidu

Telangana TDP : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు అన్ని రకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకో రోజు మాత్రమే ఉంది. అంటే.. 28న ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఒక్క రోజును తమ ప్రచారానికి బాగా వాడుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు.

ఈనేపథ్యంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపుడి గాంధీకి తెలంగాణ టీడీపీ మద్దతు ప్రకటించింది.
అభివృద్ధి పరంగా చూసుకుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని, గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, డివిజన్ల టీడీపీ అధ్యక్షులు స్పష్టం చేశారు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరినీ ఆదరించే నాయకుడు గాంధీ మాత్రమే అని.. అందుకే తమ సంపూర్ణ మద్దతు ఆయనకే అని టీడీపీ నేతలు ప్రకటించారు.