Drugs Case: తెలంగాణ‌లో డ్ర‌గ్స్ పై కేంద్ర హోంశాఖ‌కు నివేదిక‌..

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిగా దొరుకుతుంది. ఇటీవ‌ల రాడిస‌న్ బ్లూ హోటల్ లోని ప‌బ్‌పై హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలు దాడి చేశారు.

  • Written By:
  • Publish Date - April 8, 2022 / 12:42 AM IST

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిగా దొరుకుతుంది. ఇటీవ‌ల రాడిస‌న్ బ్లూ హోటల్ లోని ప‌బ్‌పై హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 150 మంది యువ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసులో చాలా మంది డ్ర‌గ్స్ వాడిన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ కేసులో మొద‌టి మ‌ర‌ణం సంభ‌వించ‌డం న‌గ‌రంలో డ్ర‌గ్స్ వినియోగం ఎంత ఉందో అర్థం అవుతుంది.

గ‌తంలో కూడా టాలీవుడ్ హీరోలను డ్ర‌గ్స్ కేసులో పోలీసులు విచారించారు.ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి పురోగ‌తి లేదు. తాజ‌గా తెలంగాణ‌లోడ్ర‌గ్స్‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై కేంద్రానికి నివేదిక అందించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, కేంద్ర‌హోంశాఖ‌మంత్రి అమిత్ షా ని క‌లిశారు. అమిత్ షాతో తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించారు. తెలంగాణ‌లో సెలెక్ట‌డ్‌గా రైడ్‌లు జ‌రుగుతున్నాయ‌ని.. పూర్తిస్థాయిలో క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని గ‌వ‌ర్న‌ర్ కేంద్రానికి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌కి రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్‌ని ఇరుకున‌పెట్టేలా డ్ర‌గ్స్ వ్య‌వ‌హ‌రం గ‌వ‌ర్న‌ర్ చేతికి చిక్కింది. ఈ వ్య‌వ‌హారంలో కేంద్ర హోంశాఖ తెలంగాణ స‌ర్కార్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి.