Site icon HashtagU Telugu

Nizamabad : అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటాం – స్పీక‌ర్ పోచారం

Pocharam

Pocharam

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప‌రిశీలించారు. న‌ష్ట‌పోయిన రైతుల‌ను క‌లిసి వారికి భ‌రోసా ఇచ్చారు. ఒక రైతుగా తనకు పంట నష్టం బాధ తెలుసని స్పీకర్ అన్నారు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి పంట నష్టంపై ప్రాథమిక అంచనాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని స్పీకర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలు కూడా జారీ చేశారని స్పీకర్ గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ ​​సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తానని స్పీకర్‌ తెలిపారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం అందింది. ఈసారి కూడా నష్టపోయిన రైతులకు తగిన సాయం అందించేందుకు కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.