Site icon HashtagU Telugu

Face Recognition : లేటుగా వస్తే.. జీతాలు కట్‌.. సచివాలయంలో కొత్త అటెండెన్స్ విధానం

Face Recognition Attendance

Face Recognition Attendance

Face Recognition : తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు, అధికారులు నేటి (గురువారం) నుండి కొత్త అటెండెన్స్ విధానానికి లోబడనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి సచివాలయం ప్రధానాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Astrology : ఈ రాశివారికి నేడు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది.!

సచివాలయంలో ప్రతి శాఖ ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా ఉద్యోగులు విధులకు హాజరయ్యే ముందు, విధులు ముగించాక తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలి. డిసెంబర్ 12 నుండి ఈ నూతన సాంకేతిక పద్ధతి అమలులోకి రానుంది. ప్రతి ఉద్యోగి హాజరును ఈ సాంకేతిక విధానం ద్వారా మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వరకు ఈ నియమం అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ రికార్డులు ఆధారంగానే ఉద్యోగి హాజరు ధృవీకరించబడుతుంది.

Boxing Day Test Tickets: బాక్సింగ్ డే టెస్టుకు హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

సచివాలయంలో ఉద్యోగులు పని ప్రారంభించే ముందు , విధులు ముగించిన తరువాత ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విధానంలో ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రవీణ్ కుమార్, సరిత అనే అధికారులను సంప్రదించవచ్చని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మార్పు ద్వారా సర్కారు సమయపాలన, పారదర్శకతను పెంపొందించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం సచివాలయంలో ఫేస్‌ రికగ్నిషన్‌ మిషన్‌లు దర్శనమిచ్చాయి. అయితే.. సమయపాలన లేకుండా విధులకు హాజరయ్యే అధికారుల ఆటలు కట్టించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.