Rains : తెలంగాణ లో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవా..?

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 11:14 AM IST

తెలంగాణ సర్కార్ (Telangana Government)..రేపు కూడా విద్యాసంస్థలకు (Educational Institution) సెలవు ప్రకటించబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. దాదాపు వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకాశానికి చిల్లు ఏమైనా పడిందా అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎటు చూసిన భారీ వరదలతో రోడ్లు చెరువులను తలపించాయి. కొన్ని గ్రామాలైతే వరదలకు నీట మునిగాయి.

శుక్రవారం నుండి వర్షాలు (Rains) తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే చాల చోట్ల వరద ఉదృతి తగ్గింది. కాకపోతే వరంగల్ పట్టణంలో పలు చెరువులకు గండి పడడం తో ఇంకా నీటిలోని పలు కాలనీ లు ఉన్నాయి. ఇదిలా ఉంటె వర్షాలు కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు వారాలుగా సరిగా విద్యాసంస్థలు నడవలేదు. భారీ వర్షం పడుతుండడం తో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్ కు పంపించలేకపోయారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రోజుల పాటు సెలవు (School Holiday) ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడం.. మరోవైపు వందలాది స్కూల్స్ ఇంకా బురదలో ఉండడం తో రేపు కూడా సెలవు ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సోమవారం సెలవుపై ఈ మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read Also : GST On PG Hostel Rent: హాస్టల్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్ న్యూస్.. అద్దెపై 12% జీఎస్టీ..!