Site icon HashtagU Telugu

Telangana : దళిత బంధుకు రూ. 600కోట్లు రిలీజ్..!!

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వరంలోని TRSసర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం మంగళవారం రూ. 600కోట్లను విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్దిదారలందరికీ ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లోకి జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476మంది లబ్దిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు.

ప్రస్తుతం ఎంపికైన లబ్దిదారుల అకౌంట్లో 3,847.6కోట్లు సర్కార్ జమ చేసింది. ఒక దళిత కుటుంబానికి రూ. 10లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకం వంద శాతం విజయవంతంగా కొనసాగుతోంది.