TS Politics: ‘మునుగోడు’ పై కేసీఆర్ ఆపరేషన్!

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహరంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

  • Written By:
  • Updated On - July 25, 2022 / 04:01 PM IST

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహరంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఢిల్లి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో అప్రమత్తమైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టేలా ప్లాన్ వేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని బరిలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మునుగోడు ఆకర్ష్ కు తెరలేపింది.

Also Read:  World With 3 Suns: ఏకంగా 3 సూర్యులతో సౌర వ్యవస్థ.. తొలిసారి గుర్తింపు!!

సీఎం కేసీఆర్ ఆదేశాలతో నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ బలోపేతంలో భాగంగా చేరికలపై గురి పెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను టీఆర్ ఎస్ లో చేర్చుకోవడం సక్సెస్ అయ్యారు. గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ముష్టిపల్లి, గట్టుపల్ కు చెందిన కీలక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డినుద్దేశించి మాట్లాడారు.

సూర్యాపేటతో సరిసమానంగా మునుగోడు ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి శాసన సభ్యుడికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువేనని ఆయన ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో ఇటువంటి నేతల ఎదుగుదల తో సరిసమానంగా ఫ్లోరోసిస్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ కోల్పోయిందన్నారు. ప్రధాని మోడీ పన్నుల ప్రధానిగా ఘనత కేక్కారని ఆయన ఎద్దేవాచేశారు. అందుకే యావత్ తెలంగాణా సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ యస్ పార్టీలో చేరుతున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చండూరు జడ్పి టిసి కర్నాటి వేంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Also Read:  5G Farming: ఫ్యూచర్ అగ్రికల్చర్ : వ్యవసాయానికి 5జీ రెక్కలు!!