TGSRTC : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. మహాలక్ష్మీ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీనితో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి, ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనటానికి, రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించగా, కొన్ని రూట్లలో అదనపు బస్సులను కూడా నడుపుతోంది. అయితే, కొత్తగా ఏర్పాటు చేసిన అదనపు బస్సుల కోసం సిబ్బందిని సమకూర్చడంలో కొంత కష్టతలు ఎదురవుతున్నాయి.
Astrology : ఈ రాశివారికి నేడు ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు..!
ఈ నేపథ్యంలో, ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బంది నియామకాన్ని చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల వేదికలపై మాట్లాడారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రసంగంలో మంత్రి పొన్నం కీలక ప్రకటనలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో 3,039 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే ఈ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడంతో రద్దీ పెరిగినందున, అదనపు బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టనున్నారు. అలాగే, జిల్లా కేంద్రాలకు లింక్ బస్సులు ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి ప్రాంతాలను కలుపుతూ బస్సుల లింకింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సమయంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు, కానీ ప్రస్తుతం 40,000 మంది మాత్రమే ఉన్నారు. త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి పొన్నం తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపించి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి సభలో ప్రకటించారు. త్వరలోనే, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, అలాగే జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు నడిపేందుకు క్రమంగా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ఈ ప్రకటనలు, బస్సుల కొత్త కొనుగోలు, సిబ్బంది నియామకాలు పూర్తి కావడం ద్వారా బస్సుల్లో రద్దీ తగ్గించే అవకాశాలు ఉంటాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
Minorities Rights Day In India : భారతదేశంలో మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?