Telangana Record: పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్

పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ మరో రికార్డును సాధించింది.

  • Written By:
  • Updated On - April 6, 2023 / 10:54 AM IST

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఇప్పటికే అత్యధిక వరి పంటను పండిస్తూ రైస్ ఆఫ్ బౌల్ గా పేరు తెచ్చుకుంది. ఇక పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ మరో రికార్డును సాధించింది. దక్షిణ భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండగా, దేశంలో మూడవ స్థానంలో నిలిచింది. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ 2020-21లో 57.97 లక్షల బేళ్ల ఉత్పత్తితో, 2021-22లో 48.78 లక్షల బేళ్లతో పత్తి ఉత్పత్తితో మూడవ అగ్రగామి రాష్ట్రంగా గా నిలిచింది.

ఉత్పత్తితో పాటు కార్మికులకు చెల్లించే పత్తి లేబర్ రేటు విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ రెండవ అగ్రగామి రాష్ట్రం. కేరళలో గంటకు కూలీ రేటు రూ.117.88 కాగా, తెలంగాణలో గంటకు రూ.98.36గా ఉంది. గుజరాత్, కర్ణాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా రూ.35.16, రూ.49.35గా ఉంది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జోర్దాష్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.