Results: తెలంగాణ ఎస్సై, ఏఎస్సై ఫలితాలు విడుదల..!

ఎస్సై, ఏఎస్సై ఫలితాలు (Results) విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది.

Published By: HashtagU Telugu Desk
Results

Compressjpeg.online 1280x720 Image

Results: ఎస్సై, ఏఎస్సై ఫలితాలు (Results) విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. రేపు ఉదయం వారి వివరాలను సైట్లో ఉంచుతామని పేర్కొంది. తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్సై, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు విడుదల అయింది. కీలకమైన కటాఫ్‌ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. TSLPRB 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి 554 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు.

గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫలితాల జాబితా వెలువరించడంతో ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్‌ కేసులపై TSLPRB ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండో వారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు ఇలా అన్ని విభాగాలకు పంపించనుంది.

Also Read: TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లుకు శాసన సభ ఆమోదం

ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారి సంబంధిత లాగిన్‌లో ఎంపిక వివరాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. రేపు అనగా ఆగస్టు 7న ఉదయం TSLPRB వెబ్‌సైట్‌లో పర్సనల్ లాగిల్ లో ఎంపికైన వారి వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా.. ఎస్సై పోస్టులకు ఏ మార్కుల వద్ద కట్ ఆఫ్ అయిందో.. కేటగిరీల వారీగా చివరి ర్యాంక్ వివరాలను కూడా వెబ్ సైట్లో రేపు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

  Last Updated: 06 Aug 2023, 07:31 PM IST