Site icon HashtagU Telugu

KTR On Ukraine Crisis: విద్యార్థులను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించండి…!!!

Ukraine Students Imresizer

Ukraine Students Imresizer

రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరిగా మారుతోంది. రాజధాని కీవ్ నగరానికి సమీపంలోనూ బాంబు దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగానే ప్రతిఘటిస్తోంది. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశామని..సైనిక స్థావరాలపై కూడా దాడులు చేశామని రష్యా తెలిపింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్, రష్యా యుద్ధ విమానాలను, హెలికాప్టర్ను కూల్చివేసినట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్ .

కేటీఆర్ ట్వీట్:
తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నారు. వారి పరిస్థితిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తనకు చాలా సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారిని వీలైనంత త్వరగా భారత్ రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదని వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని కోరకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని విద్యార్థులను తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు.

అటు ఉక్రెయిన్ లో చిక్కుకుని భారత్ కు తిరిగి వచ్చే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ తోపాటు రాష్ట్ర సెక్రటేరియట్ లోని సాధారణ పరిపాలనా విభాగంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లో ఎంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ ను నియమించారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారన్ని ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు +91 7042566955 :+91 9949351270 :+91 9654663661 ఇ-మెయిల్ ఐడి rctelangana@gmail.com.

సీనియర్ అధికారి E.చిట్టిబాబు తాత్కాలిక సచివాలయం, BRKR భవన్ లో కోఆర్డినెట్ చేయనున్నారు. హెల్ప్ లైన్ నంబర్లు – 040-23220603 మరియు +91 9440854433
(e-mail nri@telengana.gov.in)లోసంప్రదించవచ్చు.