Site icon HashtagU Telugu

Swachh Telangana:తెలంగాణకి మరో అవార్డు

defecation

defecation

తెలంగాణ రాష్ట్రానికి మరో అవార్డు లభించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమంలో భాగమైన స్వచ్చ తెలంగాణ, భారత్ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు కేంద్రం అభినందనలు తెలిపింది.

తెలంగాణ వచ్చిన ఏడేండ్లలో అనేక రంగాల్లో ఆదర్శముగా నిలిచిందని తాజాగా మరోసారి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన నివేదికలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా నిలిచి మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

స్వచ్ఛ భారత్ మిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 1/3 వ వంతు గ్రామాలను మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దిందని, దేశంలో మొత్తం మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు 17,684 ఉంటే వాటిలో 6,537 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి.

రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని మంత్రి తెలిపారు.

Exit mobile version