రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు …’దేవులపల్లి’ కన్నుమూత..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

Published By: HashtagU Telugu Desk
Devulapally

Devulapally

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దేవులపల్లి ప్రభాకరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

2016 ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం ఛైర్మన్ గా ప్రభాకరరావు కొనసాగుతున్నారు. వరంగల్ పట్టణంలోని ఆండాళమ్మ, వేంకట చలపతిరావు దంపతులకు దేవలపల్లి ప్రభాకర్ రావు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార -పౌర సంబంధ శాఖలో, రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మాస్ మీడియా విభాగంలో ఆయన సంపాదకులుగా పనిచేశారు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర, నమస్తే తెలంగాణతోపాటు పలు పత్రికల్లో దేవులపల్లి ప్రభాకరరావు వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

  Last Updated: 22 Apr 2022, 10:00 AM IST