MLA Lasya Nandita: పటాన్ చెరు ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం జరిగింది. BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి (MLA Lasya Nandita) చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పటాన్‌చెరులోని ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
BRS పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37)రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. లాస్య నందిత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల నల్గొండసభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది.
Also Read: Rakul-Jackky Bhagnani: రకుల్, జాకీ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ?
తన తండ్రి దివంగత MLA సాయన్న అడుగుజాడల్లో 2015లో లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగోవార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఆమె తన తండ్రితోపాటు BRS పార్టీలో చేరి 2016GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తండ్రి సాయన్న కన్నుమూతతో ఆయన వారసురాలిగా BRSనుంచి 2023లో MLAగా గెలుపొందారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు వరుస ప్రమాదాలు వెంటాడాయి. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం ఫిబ్రవరి 13న నల్గొండ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా.. రెండవ సారి ప్రమాదానికి గురయ్యారు. కాగా తాజాగా మూడోసారి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు.
We’re now on WhatsApp : Click to Join
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణించడం అత్యంత విషాదకరం’’ అని ట్వీట్ చేశారు.
కేసీఆర్ సంతాపం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. నందిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.