Site icon HashtagU Telugu

Singireddy: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా!

Niranjan Reddy

Niranjan Reddy

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గురువారం జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పలువురిని కలవడంతో మంత్రి కి కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేసుకోవాలని, జాగ్రత్త చర్యలు పాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.