Telangana: తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి మహేందర్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సచివాలయంలో ఈ సమవేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ ఇసుక పాలసీని తీసుకొచ్చిందని కొనియాడారు. శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 127 ఉద్యోగాల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రికి సిఫారసు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రగతిశీల మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ శాఖ రూ.2,267 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆదాయాన్ని రూ.3,884 కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. కాగా మంత్రి మహేందర్ రెడ్డి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మైనింగ్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Shobhita Rana Bikini: పెళ్లి చేసుకున్నా తగ్గేదేలే.. బికినీతో శోభితా రానా గ్లామర్ ట్రీట్
