Liquor Sale:రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డ్ నమోదు చేసింది. డిసెంబర్ 01 నుంచి 31వరకు . 3350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh Liquor License Imresizer

Andhra Pradesh Liquor License Imresizer

2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డ్ నమోదు చేసింది. డిసెంబర్ 01 నుంచి 31వరకు . 3350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. గత సంవత్సరం 2762 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.

డిసెంబర్ 31 ఒక్క రోజే బిల్లింగ్ క్లోజ్ వరకు 40 లక్షల కేసుల లిక్కర్ సేల్ జరిగిందని ఆబ్కారీ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని, లిక్కర్ సేల్ లో ఇదే అత్యధికమని పేర్కొంది.

న్యూ ఈయర్ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం కొనుగోలు సమయాన్ని పొడిగించింది. అర్థరాత్రి వరకు వైన్స్ షాపులు, ఈవెంట్స్ కి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో డిసెంబర్ 31 ఒక్కరోజే దాదాపు 105కోట్ల రూపాయల మద్యం కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు.

  Last Updated: 01 Jan 2022, 12:48 AM IST