Site icon HashtagU Telugu

Young Earth Champions 2022 : ఖండాంత‌రాలు దాటిన తెలంగాణ విద్యార్ధి ప్ర‌తిభ‌..

Global Champs 2022

Global Champs 2022

తెలంగాణ విద్యార్ధి ప్ర‌తిభ ఖండాంత‌రాలు దాటింది. డెక్స్‌టిరిటీ యూనివ‌ర్శిటీ ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ కిడ్స్ లిస్ట్‌లో తెలంగాణ‌కు చెందిన వేదాంత్‌, సాకేత్‌, య‌శ‌శ్విన్‌లు స్ధానం సంపాదించారు. డెక్స్‌టెరిటీ గ్లోబ‌ల్ గ్రూప్ విడుద‌ల చేసిన లిస్ట్‌లో ఈ ఇద్ద‌రితో పాటు ఢిల్లీకి చెందిన అర్జున్‌, త‌మిళ‌నాడుకు చెందిన స్వీగాలు ఉన్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డును ప్యారిస్‌లోని యునెస్కో హెడ్‌క్వార్ట‌ర్స్‌లో వీళ్లు అందుకోబోతున్నారు.

క్లైమేట్ ఛేంజ్‌పై చేసిన ప్రాజెక్టుకు గాను చిన్నారుల‌కు ఈ అవార్డు వ‌చ్చింది. తాజాగా వ‌చ్చిన అసోం వ‌ర‌ద‌ల్లో వంద‌లాదిగా కొట్టుకుపోయిన ఇళ్ల‌పై చిన్నారులు ప్రాజెక్టు డిజైన్ చేశారు. వ‌ర‌దల్లో కొట్టుకుపోకుండా ఉండేలా అంత‌ర్జాతీయ స్ధాయి ప్ర‌మాణాల‌తో వీరు డిజైన్ చేసిన ఇళ్ల‌కు ఈ అవార్డు వ‌చ్చింది. ఈ టీమ్‌లో ఒక‌రైన వేదాంత్ తండ్రి ప్ర‌భు హైద‌రాబాద్‌లో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Exit mobile version