Site icon HashtagU Telugu

Telangana Journalists: తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

Diary

Diary

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ – 2023 కార్యక్రమం శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమం అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ సంపాదకులు ఐ. శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యు నేత విరాహత్ అలీ, విజయకుమార్ రెడ్డి, జయసారథి రెడ్డి, వేణు నాయుడు, శ్రీనివాస్, Hashtag U జర్నలిస్ట్ కరణం రాజేష్, తొలి వెలుగు రఘు, జర్నలిస్టులు అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్, సంయుక్త కార్యదర్శి మధు, కార్యదర్శి & కోశాధికారి సురేష్ పాల్గొన్నారు.

‘మీడియా చేయలేని బాధ్యతను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక చేస్తుంది’ అని విరాహత్ అలీ అన్నారు. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛ కు కేంద్రంగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిలిచిందని.. ఇది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నా’’ అని ఆకునూరి మురళి తెలిపారు. ఆ తర్వాతం కొందడరాం మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దదని, ప్రజాస్వామ్యం లో ఓపెన్ గా , ధైర్యంగా మాట్లాడేది జర్నలిస్టులేనని, అయితే అమ్ముడు పోయే జర్నలిస్టులు కూడా ఉన్నారని ఆయన అన్నారు.

‘‘సత్యం రాజ్యమేలే చోట పని చేస్తామనే జర్నలిస్టులు ఉన్నారు.. ఇందుకు ఉదాహరణ.. ఎన్డీటీవీ జర్నలిస్టు రవీశ్ కుమార్ లాంటి వారిని చెప్పొచ్చు. ప్రశ్నించడం పాలకులకు ఇష్టం లేదు.  జర్నలిస్టులే చర్చవేదిక పెట్టడం అభినందనీయమని, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే వేదిక’’ అనిసీనియర్ జర్నలిస్టు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.