తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను 1,443 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ద్వితీయ సంవత్సరంలో 4.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు.
TS Inter Results : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Telangana DSC Results