Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

  • Written By:
  • Publish Date - February 22, 2022 / 10:59 AM IST

తెలంగాణ ఏప్రిల్ 20 నుండి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇంట‌ర్ బోర్డు తెలంగాణ విద్యార్ధుల‌కు శుభ‌వార్త చెప్పింది. ప్ర‌శ్నా ప‌త్రాల ఛాయిస్‌ను రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది నిర్వ‌హించే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌ల ఛాయిస్‌ను రెట్టింపు చేయాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గత ఇంట‌ర్ ప‌రీక్ష‌లో కొన్ని సెక్ష‌న్ల‌కు మాత్ర‌మే ఛాయిస్ ఉండేవి. అయితే ఈ ఏడాది మాత్రం అన్ని సెక్షన్లలోనూ ప్ర‌శ్న‌ల‌కు ఛాయిస్ ఉండేలా ఇంటర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌ధ్యంలో 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలకు చెందిన, మోడల్ ప్రశ్నపత్రాలను ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు.

క‌రోనా నేప‌ధ్యంలో ప్ర‌స్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేదు. కరోనా కార‌ణంగా అందరినీ పాస్ చేశారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల్లో 50 శాతానికి పైగానే విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి అందరూ పాస్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో విద్యార్థులకు కొంత సులువుగా ఉండేందుకు ఛాయిస్ ప్రశ్నలను పెంచనున్నార‌ని ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఇక తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 20 నుంచి మే 2వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయి. అలాగే ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 21 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.