Site icon HashtagU Telugu

ఎదురు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన హోం మంత్రి

Telangana Home Minister

Telangana Home Minister

సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్‌ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ,శ్రీ ఎం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీ కె.శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్ డి శ్రీ దయానంద్ కలిసి గురువారం పరామర్శించారు. ములుగు-బీజాపూర్ జిల్లా బోర్డర్లలోని కర్రిగుట్టలు అటవీ ప్రాంతంలో 18.1.2022 తెల్లవారుజామున పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ మహేష్ చేతికి బుల్లెట్ గాయమైంది.

గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బుధవారం కానిస్టేబుల్ చేతికి శస్త్రచికిత్స జరిగింది. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి వైద్యులతో హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు మరియు ఆసుపత్రిలో కానిస్టేబుల్ మరియు అతని తల్లిదండ్రులు మరియు బంధువులతో కూడా మాట్లాడారు. కానిస్టేబుల్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నారని, కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వైద్యులు హోంమంత్రికి వివరించారు. కానిస్టేబుల్‌కు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయాన్ని అందజేస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారు.