Site icon HashtagU Telugu

Bhainsa Ram Navami: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర…గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

High Court Hyderabad

High Court Hyderabad

శ్రీరామనవమి సందర్భంగా భైంసాలో శోభాయాత్రపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. షరతులతో కూడిన అనుమతిస్తూ…ఆదేశాలు జారీ చేసింది. డీజే మ్యూజిక్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయోద్దన్న హైకోర్టు….ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శోభాయాత్ర నిర్వహించవచ్చని తెలిపింది. శోభాయాత్రలో 200 మందిలోపు మాత్రమే పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇక శోభాయాత్రలో ఎలాంటి సంఘటనలు జరిగినా…కేసులు నమోదు చేయాలని పోలీసులను సూచించింది. 2021లో జరిగిన గొడవల కేసులో ముద్దాయిగా ఉన్నవాళ్లు పోలీసుల సమక్షంలో ఉండాలని కోర్టు తెలిపింది.

శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూ వాహిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిని కోర్టు…బైంసా టౌన్ నుంచి పురాన్ బజార్ వరకు యాత్రకు పర్మిషన్ ఇచ్చింది. భైంసాలో గతంలో పలు సమయాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో బైంసాను అత్యంత సున్నిత ప్రాంతంగా గుర్తించారు పోలీసులు. అయితే బైంసాలో నవమి సందర్భంగా శోభాయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి…గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది.