Site icon HashtagU Telugu

RRR: రఘురామ్ పిల్ పై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!

Mp Raghu Rama Krishnam Raju6677

Mp Raghu Rama Krishnam Raju6677

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల విచారణ అసమగ్రంగా ఉందని రఘురామ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్ర‌మంలో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని, దీంతో జ‌గ‌న్ బెయిల్ రద్దు చేసి వాటిని విచారించాలని పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే సీబీఐ కోర్టు రఘురామ కృష్ణంరాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌ను కొట్టిపారేసింది. సీబీఐ కోర్టులో చుక్కెదురైనా రఘురామ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, తెలంగాణ హైకోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుపై పిల్ దాఖలు చేశారు. అప్ప‌ట్లో ఈ పిల్‌పై తెలంగాణ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే తాజాగా ఆ పిల్ విచారణార్హతను తేల్చాలని, దానికి నంబర్ కేటాయించాలని ఆదేశాలిస్తూ సీజేఐ నేత్రుత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. పిల్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలను తోచిపుచ్చిన హైకోర్టు దుపరి విచారణను వాయిదా వేసింది.