Hydra : హైడ్రా కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌.. !

Durgam Cheruvu Residents : 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Published By: HashtagU Telugu Desk
Telangana High Court break for Hydra demolitions.. !

Telangana High Court break for Hydra demolitions.. !

Telangana High Court: తెలంగాణ హైకోర్టు హైడ్రా దూకుడుకు బ్రేకులు వేసింది. దుర్గం చెరువు కూల్చివేతలపై సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..

Read Also: Laapataa Ladies : ఆస్కార్ 2025కి కిరణ్ రావు ‘లాపతా లేడీస్’..

కూల్చివేతలు ఆపేయాలని స్టే ఆర్డర్స్‌ జారీ చేస్తూనే.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట లభించినట్లయ్యింది.

ఇకపోతే.. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మాదాపూర్‌లో కూల్చివేతలు కొనసాగిస్తోంది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అనంతరం కావూరిహిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. కాగా కావూరి హిల్స్ అసోషియషన్ నుంచి 25 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నామి స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Read Also: Atishi Empty Chair: సీఎం అతిషి పక్కన ఖాళీ కుర్చీ, బీజేపీ ఎటాక్

 

  Last Updated: 23 Sep 2024, 02:33 PM IST