Site icon HashtagU Telugu

Night Curfew in TS : తెలంగాణలో నైట్ క‌ర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్ట‌ర్

night curfew

night curfew

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ క‌ర్ఫ్యూ విధించ‌డంలేద‌ని తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాసరావు తెలిపారు. అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉంటే రాత్రిపూట కర్ఫ్యూ అవసరమని.. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్య శాఖ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో దీనిని పేర్కొంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల్లో పాజిటివిటీ రేటు 4.26 శాతంగా ఉంది. తెలంగాణలో మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం, కొత్తగూడెంలో అత్యల్పంగా 1.14 శాతం ఉంది. ఐసీయూ, ఆక్సిజన్ బెడ్‌ల ఆక్యుపెన్సీ 61 శాతం. ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యగా జనవరి 31 వరకు రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించినట్లు నివేదిక పేర్కొంది. వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడానికి ఇంటింటికీ ఫీవర్ సర్వే కూడా జరుగుతోంది. ఇప్పటివరకు 1.78 లక్షల ఐసోలేషన్ కిట్‌లు పంపిణీ చేయబడ్డాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి 59 శాతం వ్యాక్సిన్ ఇవ్వబడింద‌ని నివేదిన పేర్కొంది.